Rashid Khan all-round brilliance helps Lahore clinch last-ball thriller
#RashidKhan
#Psl2021
#LahoreQalandars
#IslamabadUnited

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2021లో అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బంతి, బ్యాటుతో మాయ చేశాడు. మొదటగా తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని కట్టడి చేయగా.. ఆపై బ్యాటుతో చెలరేగి తన జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. పీఎస్‌ఎల్ 2021లో భాగంగా బుధవారం ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచులో లాహోర్ ఖలందర్స్ అద్భుత విజయం సాధించింది. చివరి ఓవర్లో లాహోర్ విజయానికి 16 రన్స్ అవసరం అవగా.. రషీద్ స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌లా హ్యాట్రిక్ ఫోర్లు బాది జట్టును గెలిపించాడు.